అభివృద్ధి, సంక్షేమంలో మనమే నెంబర్ వన్
రాష్ట్రంలోని ప్రతి గడపకు అందుతున్న సంక్షేమ ఫలాలు
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలలో సకల సౌకర్యాలు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించి, గోపాల్ రావు పేట, వెంకట్రావుపేట ,సింగిరెడ్డిపల్లి, జానంపేట, దుగినేపల్లి, మల్లారం, గ్రామ పంచాయతీలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది, గ్రామాలలో గ్రామస్తులు పూలవర్షంతో వారికి ఘన స్వాగతం పలికారు..
తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాల్ రావు పేట గ్రామంలోని కొత్త గుంపు నుండి చింతలపాడు వరకు సుమారు 50 లక్షలు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రము పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీటీ మరమ్మత్తు ప్లడ్ డ్యామేజ్ పనుల కోసం సుమారు 2 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది…
జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త గుంపు నుండి భూపతిరావుపేట వరకు సుమారు 2 కోట్ల 80 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
దుగినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని R&B రోడ్డు నుండి ST కాలనీ వరకు 1 కోటి రూపాయిలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
కిష్టాపురం గ్రామపంచాయతీ పరిధిలోని అడవి రామవరం జంక్షన్ నుండి కిష్టాపురం వరకు బిటి రోడ్డు మరమ్మతుల కోసం సుమారు కోటి 6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది..
మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న రాజుపేట మధ్య సుమారు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
వెంకటేశ్వర్లపురం గ్రామంలోని మెట్రిక్ టన్నుల నాబార్డ్ గొదాము చుట్టూ సుమారు 85 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి సారధ్యంలోనే గ్రామాలు పట్టణాలన్నీ సమగ్ర అభివృద్ధి చెందాయని అన్నారు, సీఎం కేసీఆర్ గారు గొప్ప దార్శనికుడని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు…
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన అన్నారు, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా దళిత బంధు కల్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్లు కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ గారు అండగా నిలిచారు అన్నారు
వందలాది కోట్ల రూపాయలతో పినపాక నియోజకవర్గం లోని గ్రామాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు, గ్రామాల అభివృద్ధికి పార్టీలతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశానని వివరించారు, అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని కాంగ్రెస్ నాయకులు మాటలు నమ్మి ఆ పార్టీలకు ఓటు వేసి మోసపోవద్దని అన్నారు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో తిరుగుతూ మాయమాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వారిని నమ్మి మోసపోవద్దు అన్నారు.
అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు, తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గారు అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు, గ్రామాలలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అన్నారు, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఉంటేనే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ గారు కేవలం 9 ఏళ్లలో చేసి చూపించారని అన్నారు ఎంతో కష్టపడి 24 గంటల విద్యుత్తు తీసుకువచ్చి రైతులకు మూడు పంటలకు సాగు నిలుస్తున్న సీఎం కేసీఆర్ కి ప్రజలంతా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ రవి శేఖర్ వర్మ,కటకం గణేష్, కొండేరు రాము, దాట్ల వాసు బాబు తదితరులు పాల్గొన్నారు.





