మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల లోని తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలోనీ సమ్మక్క సారలమ్మ గుడి ప్రక్కన సిఎస్ఆర్ నిధులు 1 కోటి రూపాయలతో మున్నూరు కాపు సంక్షేమ భవన నిర్మాణం పనులకు శుక్రవారం నాడు ఉదయం 8:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేయనున్నారు అని మున్నూరు కాపు సంక్షేమం సంఘం పినపాక నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ సురేందర్ పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండుగల రాజేందర్, మున్నూరు కాపు పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పినపాక మణుగూరు,అశ్వాపురం బూర్గంపాడు,కరకగూడెం,ఆళ్లపల్లి,గుండాల,మున్నూరు కాపు సంఘం నాయకులు,యూత్ అధ్యక్షులు,కార్యదర్శులు యువజన నాయకులు,పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సురేందర్ పటేల్ కోరారు.





