UPDATES  

 పాము కాటుకు బాలుడి మృతి *నివాళి అర్పించిన ఎమ్మెల్యే రేగా

మన్యం న్యూస్ , పినపాక: మండల పరిధి పాండురంగాపురం గ్రామానికి చెందిన జబ్బ నాగార్జున కుమారుడు అన్వేష్ (8) బుధవారం రాత్రిపాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అన్వేష్ అనే బాలుడు తన ఇంట్లో నిద్రిస్తుండగా పాము పాటకు గురయ్యాడు. రాత్రి సమయం కావడంతో బాలుడి తల్లిదండ్రులు అన్వేష్ చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయాన్ని మండల బీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న విప్,పినపాక ఎమ్మెల్యే కాంతారావు గురువారం బాలుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, నాయకులు వాసు బాబు ,కొండేరు రాము తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !