UPDATES  

 పినపాక నియోజవర్గంలో అభివృద్ధి జాతర

  • పినపాక నియోజవర్గంలో అభివృద్ధి జాతర
  • అభివృద్ధికి శంకుస్థపనలు, ప్రారంభోత్సవాలు
  • విద్యా రంగానికి సీఎం పెద్దపీట
  • గ్రామీణ ప్రాంతాలకు గ్రంధాలయ సేవలు
  • 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు

మన్యం న్యూస్ మణుగూరు:

పినపాక నియోజకవర్గం లో అభివృద్ధి జాతర జరుగుతుంది.ఇందులో భాగంగా మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం గ్రామంలో సుమారు 5 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించనున్న టీడబ్ల్యు రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్ధాపన చేశారు.అనంతరం ముత్యాలమ్మ నగర్ గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్ ని విప్ రేగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రంథాలయ శాఖలో భారీ సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. గ్రంధాలయ శాఖ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని విప్ రేగా సూచించారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వారు తెలిపారు.సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు అని,ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ గురుకులా లను ఏర్పాటు చేసి పేద,మధ్య తరగతి వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మన ఊరు,మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను పునరుద్ధరించడం జరిగింది అన్నారు.అక్టోబర్ 24న దసరా కానుకగా విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు.రానున్న కాలం లో ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అభివృద్ధి,సంక్షేమాన్ని కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు ఎంపీపీ కారం.విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,స్ధానిక ప్రజా ప్రతినిధులు,రెవిన్యూ శాఖ అధికారులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !