UPDATES  

 పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

  • పేద ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం
  • పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ గోప్ప వరం
  • 16 లక్షల రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ

    మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం పరిధి లోని రామానుజవరం గ్రామ పంచాయతి కి చెందిన 16 మంది నిరుపేద కుటుంబాల కు,చెందిన ఆడపడుచులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణ లక్ష్మి,,షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన 16,01,856 రూపాయల విలువ గల చెక్కులను వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మణుగూరు జెడ్పీటీసీ పోశం.నరసింహరావు ఎంపీపీ కారం విజయ కుమారి వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు అసరా అని,పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్పిస్తున్న అద్భుతమైన పథకమని వారు తెలిపారు. అభివృద్ధి,సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని సంక్షోభం లోనూ,సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.2014 ముందు ఆడ బిడ్డలకు పెళ్లి చేయాలంటే పేదవారు అప్పు చేసి పెళ్లి చేసేవారని,బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా 1,00,116 రూపాయలను ఆడబిడ్డలకు సర్కార్ కానుకగా అత్యంత పారదర్శకంగా చెక్కుల రూపం లో నేరుగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,రెవెన్యూ అర్ ఐ రాంమూర్తి,స్థానిక ఉప సర్పంచ్ తదికమళ్ళ ప్రభుదాస్, బిఅర్ఎస్ పార్టి మండల అధ్యక్షులు ముత్యం బాబు, గ్రామ అద్యక్షులు బొగ్గుల నాని, కొత్త మల్లేపల్లి గ్రామ అద్యక్షులు డేగల సంపత్ కుమార్, యువజన నాయకులు, మండారీ సతీష్,గంటక ఏశావు,శేషుకుమార్,ప్రవీణ్,రాంమూర్తి,శంకర్,పుల్లయ్య, ఇరయ్య,గ్రామస్తులు,రాజు,రాజేంద్రం,సమ్మక్క,మరియమ్మ,రాములు,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !