మన్యం న్యూస్ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు టౌన్,రూరల్, పినపాక మండలాలలో పర్యటించి,పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిఏ చందా హరికృష్ణ తెలిపారు.పర్యటన వివరాలు
1.ఉదయం 07.00 గంటలకు మణుగూరు టౌన్ బెస్తగూడెం, శాంతినగర్,హరిజనవాడ, విటల్ రావు నగర్,కుమ్మరి బజార్,రాజుపేట,బాపన కుంట,శివలింగాపురం,పైలెట్ కాలనీ,ఎస్బిఐ బ్యాంక్ ముందు, సుందరయ్య నగర్,కుంకుడు చెట్ల గుంపు,ఆదివాసి కాలనీ, మామిడి చెట్ల గుంపు,ఐలమ్మ నగర్,తహసిల్దార్ కార్యాలయం లో బతుకమ్మ చీరల పంపిణీ, సీసీ రోడ్ లు,డ్రైనేజి,కొత్త మున్సిపాలిటి కార్యాలయం లకు శంఖుస్థాపన.
2.ఉదయం 09.00 గంటలకు తోగ్గుడెం సమ్మక్క సారలమ్మ గుడి దగ్గర రెడ్డి,మున్నూరు కాపు సంఘ భవనం లకు శంఖుస్థాపన
3.ఉదయం 11.00 గంటలకు పినపాక గ్రామం,మండలం లో నూతన ఫైర్ స్టేషన్ ప్రారంభం చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని పిఏ హరికృష్ణ కోరారు.





