మన్యం న్యూస్,కొత్తగూడెం ప్రతినిధి:
ఫోక్సో కేసులో వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విదిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి (పొక్సో స్పెషల్ జడ్జ్) ఏం.శ్యామ్ శ్రీ గురువారం తీర్పు చెప్పారు.కేసు వివరాలు ఇలా…. 2022 జూలై 27 న మైనరు అమ్మాయి ని దుమ్ముగూడెం మండలం లక్ష్మీనర గ్రామానికి చెందిన బొందల వెంకటరమణ అసభ్యంగా ప్రవర్తించారని,తన తల్లి పిఎస్ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి యస్.ఐ ఎం.రవికుమార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోనగా దర్యాఫ్తు చేయగా,అప్పటి ఇన్స్పెక్టర్ డి.రమేష్ కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్టులో పది మంది సాక్షులను విచారించారు.నేరం రుజువు అయినదని కోర్టు భావించి సెక్షన్ 8 ఆఫ్ పొక్సో ఆక్ట్ ప్రకారం నాల్గు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష , రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.ప్రాసెక్యూషన్ ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పీవీ డి.లక్ష్మి,రావి విజయకుమార్ నిర్వహించారు.లైజాన్ ఆఫీసర్ ఎం.హరి గోపాల్,పి.ఎస్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ వడ్డే నవీన్ సహకరించారు.





