మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలో నూతన గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ఐటిడిఏపీ అంకిత గురువారం ప్రారంభించారు. అనంతరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తెలంగాణ రాష్ట్రరాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేశారనీ అన్నారు. గురుకుల పాఠశాలలో విద్య అభ్యసించిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారని గురుకులంలో సీటు సాధించడమే కష్టమనే భావనలో ఉన్న విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అన్నారు.గురుకులం విద్యార్థులకు క్లాస్ బుక్స్, నోట్ బుక్స్, దుస్తులు చెద్దర్లు పంపిణీ చేశారు. పౌష్టికమైన ఆహారం పిల్లలకి అందించాలని ప్రిన్స్ వాళ్లకు తెలిపారు. గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి ఏవి రాజ్యలక్ష్మి,
గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 5,6 తరగతులతో ప్రారంభించామని ప్రతి సంవత్సరం తరగతి పెరుగుతూ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ వెంకటేశ్వర్లు ప్రిన్సిపాల్ రాజేశ్వరి సిబ్బంది తదితరు పాల్గొన్నారు.





