మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మండలానికి చెందిన సంతాపురి సంతోష్,పాండ్రామీసు వెంకట సతీష్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువకులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకుంటే ప్రభుత్వ కొలువు సాధించడం సాధ్యం అవుతుంది అని ఎమ్మెల్యే యువత కు సూచించారు.





