మన్యం న్యూస్, వాజేడు:
మండలం పేరూరు గ్రామం చెందిన పోలేబోపోయిన వసుమతి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. గత సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయగా ఫలితం విఫలం అయింది. ప్రభుత్వ ఉద్యోగం కానిస్టేబుల్ సాధించాలని అకుంఠ దీక్షతో సాధన చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సేదించారు.
కుటుంబ నేపథ్యం
పోలేబోయిన వీర మోహన్ రావు /మల్లక్క ఊరటం కొత్తూరు గ్రామం తాడ్వాయి మండలం ములుగు జిల్లా, దంపతులకు ప్రథమ పుత్రిక, వివాహం అనంతరం వాజేడు మండలం పేరూరు గ్రామంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు కుటుంబం గడవడం భారంగా ఉందని చెరుకూరు ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా అర్హత సాధించినట్లు తెలిపారు.





