మన్యం న్యూస్ గుండాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో గుండాల మండల మన్యం విద్యార్థులు సత్తా చాటారు. మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన రాకేష్ ఫైర్ మాన్ గా కొలువు సాధించగా దేవసాని సునీల్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించారు. చిన్ననాటి నుండి కొలువు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగిన విద్యార్థులు మొదటి దపాలోనే ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు బంధువుల మిత్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు





