మన్యం న్యూస్, బూర్గంపహడ్:
మండల కేంద్రానికి చెందిన పుట్టి నర్సింహారావు విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలలో ప్రతిభ కనబరిచినాడు.తన చిన్న నాటి నుండి చదువుపై దృష్టి సారించి ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నం చేసి తొలుత మొదటి ప్రయత్నంలోనే 2020 సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. అంతటితో సంతృప్తి చెందలేదు. మరల 2వ ప్రయత్నంలో 2023 అక్టోబర్ మొదటి వారంలో వెలువడిన ఫలితాల్లో జైలు ఉద్యోగం పొంది గ్రామ మరియు మండల ప్రజల మన్ననలు పొందుతున్నాడు.ఈ క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజలు,స్నేహితులు సైతం నర్సింహారావు కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నేటి మండల యువత కు ఆదర్శంగా నిలిచాడు.





