సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు మృతి
*సంతాపం తెలిపిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్,ములుగు:
జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు. సిద్ధబోయిన లక్ష్మణ్ రావుకు భార్య అనిత, పిల్లలు సౌమ్య, నితిన్ ఉన్నారు. గత నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందారు.
సంతాపం తెలిపిన భద్రాద్రి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మేడారం సమ్మక్క పూజారి అయినా సిద్ధ బోయిన లక్ష్మణరావు మృతి పట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.





