ప్రజల ఆశీర్వాదమే నాకు కొండంత అండ
*అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ రేగా
*
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో 25 లక్షల 29 వేల రూపాయల వ్యయంతో స్పెషల్ రోపేర్స్ గ్రాంట్,అల్లెరుగూడెం నుండి బర్లగూడెం వరకు అర్అర్ గ్రాంటు నుండి 2 కొట్ల26 లక్షల రూపాయల వ్యయంతో బిటి రోడ్డు,బట్టుపల్లి అర్అండ్ బి రోడ్డు నుండి బుర్దరాం గ్రామంవరకు ఎస్డిఎప్ నదుల నుండి 2 కొట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మనం చెపట్టనున్న అభివృద్ధి పనులకు పినపాక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్,బిఅర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లోని ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంత బలంఅని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించడమే లక్ష్యంగా నియోజకవర్గంలోని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతానని ఆయన అన్నారు స్వరాష్ట్రంతోపాటు తన నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా,ఎంపీడిఓ.శంకర్, తహశీల్దారు నరేష్, వివిధ శాఖల అధికారులు,బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,వివిధ గ్రామపంచాయతి సర్పంచ్ లు అధికారులు బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





