UPDATES  

 ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ.1లక్ష30వేళా4 విరాళం అందజేత

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ.1లక్ష30వేళా4 విరాళం అందజేత

తల్లి తండ్రి లేని సుమారు 26 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదువేల రూపాయలు వితరణ

మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండలం గౌతమీస్ఫూర్తి ఫౌండేషన్ భారజల కర్మాగారం అశ్వాపురం వారు ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వాపురం నందు చదువుతున్న తల్లి తండ్రి లేని సుమారు 26 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5వేల వితరణగా అందజేశారు.గత మూడు సంవత్సరాల నుండి కోలిశెట్టి సోమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. గురువారం జరిగిన కార్యక్రమానికి ఇంటర్మీడియట్ విద్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నోడల్ అధికారి సులోచన రాణి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి గౌతమి స్ఫూర్తి ఫౌండేషన్ కళాశాలకు చేస్తున్న సహాయ కార్యక్రమాలను కొనియాడారు.ఈ సందర్భంగా దాత కోలిశెట్టి సోమయ్య మాట్లాడుతూ మంచిగా చదువుకునే విద్యార్థులకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సత్య ప్రకాష్, లెక్చరర్ సుధాకర్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు రఘునాథ్ రాము మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !