మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు జెకె 5 ఉపరితల గని కొనసాగింపులో భాగంగా తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్ గ్రామపంచాయితీ లోని భూపేష్ నగర్, తిలక్ నగర్, కుమ్మరి బస్తి, శేషగిరి నగర్ లోని కొంత నియమిత భుబాగం లో మాత్రమే ఓసి తీయ్యనున్నట్లు గా సింగరేణి సంస్థ 21ఫీట్ ఏరియా లోని కొన్ని నియమిత ఇళ్లకు సోషల్, ఎకనామిక్ సర్వే నిర్వహించింది. మిగతా ఇల్లు ఓసి పరిధిలోకి రావంటు, సర్వే చేయటం లేదని అధికారులు అంటున్నారు. దాంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. తిలక్ నగర్ సర్పంచ్ ధనసరి స్రవంతి అధ్వర్యంలో 21 పిట్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలతో కలసి గురువారం మీడియా సమావేశం నిర్వహించరు. సందర్బంగా వారు మాట్లాడుతూ 21 ఫీట్ ఏరియా పరిధిలోని ప్రాంతం అంతానూ అండర్ గ్రౌండ్ మైనింగ్ జరిగి ఉన్నందున ఏ క్షణమైనా బ్లాస్టింగ్ లో కూలిపోవచ్చని అన్నారు. తరతరాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నామని అన్నారు. విభజించ వీలు లేని ఏరియను కొంతవరకే ఓసి తీస్తూ మిగిలింది ఓసి పరిధి కాదంటూ సింగరేణి సంస్థ తమ జీవితాలతో చెలగాటం ఆడేందుకు సిద్దం అయిందని అదే జరిగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు. సమస్య లపై స్థానిక ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ ను కలిసినప్పుటికి సింగరేణి యాజమాన్యం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. తమకు న్యాయం జరగకపోతే రానున్న స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో చాందావత్ రమేష్ బాబు, పోతిరెడ్డి సారంగపాణి, ధనసరి రాజు, శివ, విజయ్, మహేష్, శ్రీను, సుధాకర్, రత్నాకార్,రమేష్,రాజు, రమేష్, వంశీ రఘు,అశోక్, అనిల్, రవి, హుసేన్, రమ్య, భద్రలి, వసంత, లక్ష్మి, కైక తదితరులు పాల్గొన్నారు.





