మన్యం న్యూస్ ,అశ్వాపురం: మండలంలో సీతారామపురం గ్రామపంచాయతీలో 7 సీసీ రోడ్లు తుమ్మలచెరువు గ్రామ పంచాయతీ రామవరం,భీమవరం,కురవపెల్లి,కొత్తూరు గ్రామాలల్లో 6 రోడ్లను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సుమారు 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 13 సీసీ రోడ్లను అశ్వాపురం మండలం జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాలను ఉద్దేశించి అశ్వాపురం మండల జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదననీ మన మండలంలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్న రేగా కాంతారావుకి రుణపడి ఉండాలనీ అన్నారు.ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నదని,సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయడం లేదని,ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీతారామపురం సర్పంచ్ చాప ఉమాదేవి,తుమ్మల చెరువు సర్పంచ్ బండ్ల సంధ్యారాణి, తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,దైద నారాయణరెడ్డి,సూదిరెడ్డి గోపిరెడ్డి,ఏనుగుల సత్యనారాయణ,కోరేం రామారావు,తాటి ఈశ్వర్,ఒర్రే కొమరయ్య,దొడ్డ రాంబాబు,బండ్ల కాంతారావు,తాటి వెంకటేశ్వర్లు,బొల్లు నరేష్,బెల్లి వెంకన్న,ఎండి జావీద్,వార్డ్ మెంబర్లు స్థానిక ప్రజాప్రతినిధులు,తదితర నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.





