మన్యం న్యూస్, మంగపేట.
ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం రాజుపేట లోజరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గిరిజన సంఘం మండల నాయకులు కొమరం సందీప్ హాజరై…మాట్లాడుతూ రాజుపేట ను మండల కేంద్రం గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాకు ఏ మంత్రులు వచ్చినా గాని అడ్డుకుంటామని తెలియజేశారు. ఆఖినే పల్లి మల్లారం నుండి చుంచుపల్లి వరకు రాజుపేట మండల కేంద్రం చేయాలన్నారు. దొమెడ,తక్కెళ్ళగూడెం,చింతకుంట ,తిమ్మాపురం ,కత్తిగూడెం ,రాజుపేట ,చుంచుపల్లి ఈ ప్రాంతాల నుంచి మంగపేట మండల కేంద్రానికి పోవాలంటే చార్జీలు భారంగా పెరగటం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు పోలేని పరిస్థితి అన్నారు అదేవిధంగా పోయినా కానీ మండల కేంద్రంలో ఒక్కరోజు పనులు కావడం లేదు అన్నారు. మూడు నాలుగు రోజులు అదే పని పెట్టుకొని పోవాలంటే పేద మధ్యతరగతి ప్రజల వద్ద పైసలు లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని వారు తెలియచేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజుపేట ను మండల కేంద్రం చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాజుపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.





