పేదల సంక్షేమ పార్టీ బిఆర్ఎస్ పార్టీ:ప్రభుత్వ విప్ రేగా
దసరా కానుకగా ఏటా బతుకమ్మ చీరలు అందిస్తున్న ప్రభుత్వం
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ ,అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 22 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ తోపాటు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బతుకమ్మ చీరలను పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు కళ్యాణ లక్ష్మి శాదింపు వారి పథకాలు ఆసరాగా నిలుస్తుందఅన్నారు. పేదింటి ఆడబిడ్డకు పెండ్లి కానుకగా లక్ష 116 రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన అన్నారు.కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్యవివాహాలు సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది అన్నారు. ప్రజలకు కావలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నదని అన్నారు.బతుకమ్మ పండుగకు ఇంటి ఆడపడుచులకు గౌరవించుకోవడం మన సాంప్రదాయమని అయినా అన్నారు.తెలంగాణ ఆడపడుచులకు ఒక ఇంటి పెద్దగా పెద్దన్నగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్నారని తెలిపారు.బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు పండుగ కాను కానీ ఆయన అన్నారు. గత ప్రభుత్వాలకు సీఎం కేసీఆర్ పాలనకు తేడా చూడాలి అని గతంలో కరెంటు లేక ఇబ్బంది పడేది ఇప్పుడు వద్దన్నా కరెంటు వస్తుంది అని తెలిపారు.తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకునేలా సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు, తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షన్,వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,ఎంపీటీసీలు,గ్రామపంచ యితీలో సర్పంచులు,ఉప సర్పంచ్లు ,వార్డు మెంబర్లు,ఎమ్మార్వో రమాదేవి,ఎంపీడీవో వరప్రసాద్,ఎంపీ ఓ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ ,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,మండల ప్రజా పరిషత్ సిబ్బంది,తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ,మండల నాయకులు ,యువజన నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ,వివిధ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





