మన్యం న్యూస్ కరకగూడెం: రైతులు సాగు చేసుకునేందుకు తక్కువ ధరకే ట్రాక్టర్,వ్యవసాయ పనిముట్లు మహిళ సమాఖ్య అందించి,అన్నదాతలకు అండగా ఉంటుందని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
గురువారం కరకగూడెం మండల స్వయం శక్తి మహిళ సమాఖ్య(ఐకేపీ) అధ్వర్యంలో ట్రాక్టర్,వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లును ఏపీఎం త్రిగుణతో కలసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల మహిళ సమాఖ్య కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా రైతులకు తక్కువ ధరకే సేవలందడంతో పాటు వ్యవసాయంకు దుక్కి దున్నడం మొదలుకొని,విత్తనాలు వేయడం,పురుగు మందులు వేయడం వంటి పరికరాలు రైతులకు అద్దెకు ఇవ్వడం జరుగుతుందని సూచించారు.మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం ఎంపీపీ రేగా కాళిక ను ఐకేపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు పోలెబోయిన సరస్వతి,సీసీలు ముత్యాలరావు,విజయలక్ష్మి,అకౌంటెంట్ ప్రీతి,బీఅర్ఎస్ నాయకులు రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,రేగా సత్యనారాయణ,గుడ్ల రంజిత్,పాయం రాజబాబు,కటుకోజ్వల దిలీప్,వేణు,యగ్గడి శ్రీను,నిట్టా ఏడుక





