మన్యం న్యూస్,పినపాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం పినపాక, మణుగూరు మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే ఈ పర్యటనలో పాల్గొని రూకోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయడం గమనార్హం. పినపాక నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు వచ్చేస్తున్న ఎమ్మెల్యే రేగా కమిట్మెంట్ ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అనారోగ్యంలో సైతం సుడిగాలి పర్యటనలు చేసిన ఎమ్మెల్యే రేగాలాంటి ఎమ్మెల్యే పినపాక నియోజకవర్గం ప్రజలకు దొరకడం అదృష్టమని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం జరిగింది.





