విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు
-విద్యార్ధి శరీరం పై గాయాలు
– ఉపాధ్యాయుని విచారణ చేసిన ఎంఈవో
మన్యం న్యూస్ ,కారేపల్లి,(అక్టోబర్ 06):
విద్యార్ధి అల్లరి చేస్తున్నాడని ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి చితక బాదటంతో విద్యార్ధి గాయలైన ఘటన కారేపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి రాగా దానిపై మండలవిద్యాశాఖాధికారి జయరాజ్ శుక్రవారం విచారించారు.కారేపల్లిలో ఓ ప్రయివేటు స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న జయరామ్ అనే విద్యార్ధి అల్లరి చేస్తున్నాడని,హోమ్ వర్క్ సరిగా చేయడం లేదని అగ్రహించిన ఆ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కర్రతో జయరామ్‌ను చితక బాదాడు.దీంతో జయరామ్ పిరుదులపై వాతలు పడ్డాయి.స్నానం చేయటానికి, కూర్చోవటానికి ఇబ్బందులు పడుతున్న జయరామ్ ను తల్లిదండ్రులు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. ఎందుకు ఇబ్బంది పడుతున్నావని తండ్రి మాలోత్ దేవ్‌సింగ్ గద్దించి అడగటంతో సార్ కోట్టటంతో వాతలు పడ్డాయనే విషయం తెలిపాడు.దీనిపై విద్యార్ధి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయుడు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ పెన్నీల ను నిలదీశారు.దీనిపై ఎంఈవో జయరాజ్‌కు తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. పిర్యాదుపై పాఠశాలలో ఎంఈవో విచారణ చేశారు. విచారణ నివేధికను జిల్లా అధికారులకు నివేధించనున్నట్లు ఎంఈవో తెలిపారు.





