- సీఎం కేసీఆర్ హయాంలోనే క్రీడలకు ప్రాధాన్యత
- క్రీడాకారులకు క్రీడా కిట్లు పంపిణీ
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయం నందు మండలోని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు క్రీడ కిట్లా పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రీడాకారులకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతుంది అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు క్రీడా రంగానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నారు. క్రీడాకారులు మంచిగా ఆడి జాతీయ స్థాయిలో విజయం సాధించడానికి,దేశానికి,మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ కు మంచి పేరు తేవాలని కోరారు.ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అని,రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించి వారి నైపుణ్య ప్రదర్శించే అవకాశం కల్పించింది అన్నారు.ప్రతి క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.గ్రామాలలో క్రీడా పోటీల నిర్వహణకు అనుకూలంగా క్రీడ కిట్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు ఎంపీపీ కారం.విజయకుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,తహసిల్దార్ రాఘవరెడ్డి,ఎండిఓ చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్, ఉమామహేశ్వరరావు ఎంపిటిసి లు,స్థానిక సర్పంచు లు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు కార్యదర్శి నవీన్, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు, బిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.





