UPDATES  

 గౌరవవేతనం వద్దు… కనీసవేతనం ఇవ్వండి పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు చండ్రఅరుణ డిమాండ్

 

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు ప్రగతిశీల మహిళాసంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఆశావర్కర్లు చేస్తున్న సమ్మెశిబిరాన్ని పీఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు చండ్రఅరుణ, జిల్లా అధ్యక్షురాలు యదల్లపల్లి సావిత్రిలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆశా కార్మికుల సమ్మె పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామన్నారు. ఆశావర్కర్లు చేస్తున్నటువంటి సమ్మె చాలా న్యాయమైనదని చట్టపరమైనదని వారిపనికి భద్రత కల్పిస్తూ 26 వేలరూపాయలు జీతం ఇచ్చి ప్రమాదబీమా కల్పించాలని ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ల పట్ల ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ డివిజన్ నాయకురాలు కొమరారం మాజీ సర్పంచ్ కోరం ముత్తక్క, ఇల్లందు డివిజన్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !