మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండల పరిధిలోని బోజ్జయి గూడెం పంచాయితీలో 67 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో వేపలగడ్డ,అన్నారం గ్రామాల్లో అవసరం అయిన 15 అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ శంకుస్థాపన చేశారు.20 లక్షల రూపాయల ఇజిఎస్ నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. శభాష్ నగర్, బాలాజీ నగర్ గ్రామ పంచాయితీల్లో 1.65 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి, ఇజియస్ నిధులతో గ్రామాల్లో 25 అంతర్గత రోడ్లను , నూతన గ్రామపంచాయతీ భవనానికి ఎమ్మెల్యే హరిప్రియ హరీసింగ్ నాయక్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో 100% శాతం సిసి , బిటి రోడ్లను పూర్తి చేసుకుని గర్వంగా నిలిచామని అన్నారు. సిసి, బిటి రోడ్ల వల్ల గ్రామాలు చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయని, ఇంతటి అభివృద్ధికి సహకరించి, చేయూతనందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూన్నామని అన్నారు. గ్రామాలలో అభివృద్ధి పనులకు సహకరించిన ఎంపీటీసీలను, సర్పంచ్ లను, వార్డు సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, మెట్ల కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శీలం రమేష్ , ఖమ్మంపాటి రేణుక, పూదూరి లక్ష్మీనారాయణ , ఏంపిటీసీ శీలం ఉమా, సర్పంచ్ మంగమ్మ, పాయం స్వాతి, నాయకులు నీలం రాజశేఖర్, యాకూబి, శీలం సురేష్, వల్లాల నరసయ్య, కొలిపాక శ్రీను, బానోతు ధర్మ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.





