మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని కామేపల్లి మండల రైతువేదిక నందు పన్నెండుమంది లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణలక్ష్మి చెక్కులను ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ..పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ అని, ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ లాంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిన ఘనత భారాసా ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో ఎన్నో ఏళ్ళు పాలించిన ఏ ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని నేడు కేసీఆర్ ప్రభుత్వహయాంలో అన్నివర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే కొంతమందికి అదినచ్చడం లేదని అన్నారు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తప్పక వస్తుందని అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





