UPDATES  

 కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం..

కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం అక్టోబర్ 6::
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన ఇరువురి యువకులు విజయం సాధించారు. మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన జెట్టి పూర్ణయ్య కుమారి దంపతుల కుమారుడు జట్టి నవీన్ కుమార్ ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఫైర్ మాన్ గా సెలెక్ట్ అయ్యాడు. అతి నిరుపేద కుటుంబానికి చెందిన నవీన్ ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం రెసిడెన్షియల్ పాఠశాల అన్నపురెడ్డిపల్లి లో ఇంటర్ భద్రాచలంలో డిగ్రీ పూర్తి చేసిన నవీన్ పోలీస్ రిక్రూమెంట్లో శిక్షణ తీసుకొని బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో విజయం సాధించారు. అలానే మండలంలోని ఆర్లగూడెం గ్రామానికి చెందిన కొర్స కొండయ్య సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు 2009 నుంచి భద్రాచలం ఏఎస్పి ఆఫీసులో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండయ్య ఉన్నత స్థానం కోసం కష్టపడి చదివి సివిల్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి అందరి మన్ననలు పొందారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వీరు ఇరువురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు పలువురు వీరిని అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !