మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని
జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ ఆర్సి కే.బసవయ్య అన్నారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలోని సింగరేణి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం బాబుక్యాంప్ గాజులరాజం బస్తీ మధురబస్తీ ప్యూన్ బస్తీ పాత కొత్తగూడెం గౌతమ్ నగర్ మహిళలకు ఉచిత బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ శిక్షణా తరగతులను జిఎం బసవయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగ కుటుంబ మహిళలు పరిసర ప్రాంత మహిళలు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వృత్తి విద్యా కోర్సులను సక్రమంగా ఉపయోగించుకొని క్రమం తప్పకుండా హాజరై కోర్సు పూర్తి చేసి మంచి శిక్షణ పొంది వృద్దిలోకి రావాలని కోరారు. ఇందులో భాగంగా శిక్షణా తరగతులను ప్రారంభించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని పేర్కొన్నారు.
ఈ వృత్తి శిక్షణా కోర్సులు నేర్చుకున్న మహిళలు వృత్తి శిక్షణ ద్వారా యూనిట్లను నెలకొల్పుకొని తమతో పాటు మరికొందరికి జీవనోపాధి కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏజిఎం(పర్సనల్) కే.శ్రీనివాస రావు, వెల్ఫేర్, సేవా అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ టి.శ్రీనివాసరావు, వెల్ఫేర్ పిఏ వరప్రసాద్, సేవా కొ ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవాసెక్రెటరీ మునిలా, స్పొర్ట్స్ సుపర్వైసర్ ఎంసి పోస్ నెట్, సేవా కో-ఆర్డినేటర్లు మీనాక్షి, రమాదేవి, సుజాత, హిమబిందు, రాజేశ్వరి, వహీదా, దీప, స్వర్ణలత, శిక్షకులు యాకుబ్బి, ఇందుమతి, రుబీన, కవిత ఇతర సేవా సభ్యులు పాల్గొన్నారు.





