మన్యం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం బ్యూరో:
భయం వద్దు ధైర్యంగా ఉండండి అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు భరోసా ఇచ్చారు. కొత్తగూడెం-భద్రాచలం ముర్రేడు హైలెవల్ బ్రిడ్జి క్రింద వైపు వాగు ఒడ్డు కోతకు గురి కాకుండా 35 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే వనమా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముర్రేడు వాగు గుండాల మండలం నుండి మొదలై టేకులపల్లి, లక్ష్మిదేవిపల్లి, పాల్వంచ మీదగా ప్రవహించి అనంతరం గోదావరిలో కలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది వర్షా కాలంలో భారీ వర్షాల కారణంగా 50-60 వేల క్యూసెక్కుల ప్రవాహంతో వరద ఉదృతి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా లక్ష్మిదేవిపల్లి మండలంలోని ముఖ్యంగా ముర్రేడువాగునకు ఎడమ వైపున ఉన్న సంజయ్ నగర్ ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిదిలో గల వాగు కట్ట కోతకు గురవుతుందని తెలిపారు. దీంతో ఎడమ వైపు కట్ట ఒడ్డుపైన నివసిస్తున్న అనేకమంది పేద ప్రజలు గతంలో నిర్మించికొని ఉన్న ఇండ్లు కూలిపోవటం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీలు బాదావత్ శాంతి, బుక్య సోనా, జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్ రఘు, ఇరిగేషన్ ఈఈ అర్జున్, పంచాయతీరాజ్ డిఇ, టిపిఓ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
22 కోట్లతో మంచినీటి పైప్ లైన్ కు శంకుస్థాపన…
కొత్తగూడెం పట్టణంలో 22కోట్లతో చేపట్టనున్న నూతన మంచినీటి పైపులైన్ నిర్మాణానికి శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిన్నెరసాని జలాల నీటి పథకాన్ని 1989 సంవత్సరంలో తీసుకురావడం జరిగిందన్నారు. అయితే కిన్నెరసాని నీటి పైపులైను లీకేజ్ అవుతున్న కారణంగా దాని స్థానంలో కొత్త పైప్ లైన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్ర శేఖర్ రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, లక్ష్మిదేవిపల్లి ఎంపీపీ భూక్యా సోనా, మున్సిపల్ కమీషనర్ రఘు, మున్సిపల్ డిఈ రవి, పబ్లిక్ హెల్త్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన…
చుంచుపల్లిలోని పెనుబల్లి గ్రామం వద్ద సుమారు 5 కోట్ల వ్యయంతో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జికి నిర్మాణ పనులకు శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఎంపీపీలు బాదావత్ శాంతి, సోనా, మున్సిపల్ కమిషనర్ రఘు,
మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జేవిఎస్ చౌదరి, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, ఎంపీటీసీలు కొల్లు పద్మ, బాబురావు, బుక్య రుక్మిణి, సర్పంచ్ లు తాటి పద్మ, పద్మ, బలరాం నాయక్, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నిమ్మకాయల సాంబశివరావు, డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





