* మన్యం న్యూస్, నూగూర్ వెంకటాపురం:
మండలం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల సీనియర్ నాయకులు శ్రీ సంక హేమ సుందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ ,ఎంపీపీ, మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం లో దళిత బంధు పేరుతో అమాయక దళితుల వద్ద దళిత బంధు ఇప్పిస్తానని
ఎమ్మెల్యే అనుచరులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. దళిత బంధు సెలక్షన్ లిస్టులో పేరు లేకపోవడంతో అమాయక దళితులు లబోదిబో అంటున్నారని అన్నారని, దళిత బంధువలన దళితుల బతుకులు బాగుపడతాయని లక్షల రూపాయలు పుస్తెలతాడు తనఖా పెట్టి, వడ్డీలకు డబ్బులు తెచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులకు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నట్టు తెలిపారు, దళిత బంధు కోసం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని వారు కోరారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని బహిరంగంగానే ప్రజలు అనుకుంటూ ఉంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఈడి సీబిఐ అధికారులు తగు విచారణ జరిపి అమాయక దళితుల వద్ద వసూలు చేసిన కోట్ల రూపాయలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జలిగంపల లక్ష్మీపతి యువజన మోర్చా అధ్యక్షులు నోముల శ్రీ కిషన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకాల దుర్గ మరియు మండల నాయకులు సురేష్,రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు





