మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండల పరిధి లోని గుట్ట మల్లారం,ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ,బోడెపూడి నగర్,గుట్టమల్లారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర,గ్రామాలలో ఎస్డిఎఫ్ గ్రాంట్ నిధులతో సుమారు 60 లక్షల రూపాయల తో సీసీ రోడ్డు పనులకు జడ్పిటిసి సభ్యులు పోశం నరసింహారావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మండలంలో,జరుగుతున్నాయని వారు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకే దక్కుతుందని వారు స్పష్టం చేశారు.ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మండల ప్రజల తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,గుట్ట మల్లారం సర్పంచ్ కారం ముత్తయ్య,పిఆర్ఏఈ రెయిన్ హార్ట్,ఎంపిఓ పల్నాటి. వెంకటేశ్వరరావు,ఎంపీటీసీ సభ్యులు కనితి బాబురావు, ఉపసర్పంచ్ గంగారపు సరిత, పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్,మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, వార్డు సభ్యులు గుడిపూడి సరోజిని,బీఆర్ఎస్ పార్టీ నాయకులు మడి వీరన్నబాబు, ఎంపీటీసీ సభ్యులు కోమరం పాపారావు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,గంగారపు రమేష్, గనిబోయిన నాగరాజు, వేల్పుల సురేష్,రాము,కారం సమ్మక్క, వెంకటేశ్వర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





