మన్యం న్యూస్, కారేపల్లి,అక్టోబర్ 07):
ఉద్యోగ భద్రత,కనీస వేతనం,పని భారం తగ్గింపు వంటి సమస్యలపై ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా శనివారం కారేపల్లిలో బిక్షాటన నిర్వహించారు.చాలీ చాలనీ వేతనాలతో పల్లె వైద్య సేవలు అందిస్తున్నా ఆశా వర్కర్లపై ప్రభుత్వానికి జాలి లేదని ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ బిక్షాటన చేశారు.ఈసందర్బంగా సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడుతూ,కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన ఆశా కార్యకర్తలను ప్రభుత్వ విస్మరిస్తుందన్నారు.సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆశాలు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాంకుడోత్ కమల,జంగా కళ్యాణి,నాయకురాళ్లు మేదరి కుమారి,అంజమ్మ, రాంబాయి,సుజాత,ఈశ్వరి,పద్మ,చంద్రమ్మ,కృష్ణమ్మ, సరస్వతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





