మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 07, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలవేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని ఖమ్మం ఎంపీ, వైరా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నామ నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. శనివారం ఆర్కే ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల సంగ్రామంలో అంతా కలసి సమిష్టిగా కష్టపడి పార్టీ అభ్యర్థి మదన్ లాల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గ్రామాలలో ప్రజలకు వివరించాలని కోరారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అందరం సమిష్టిగా ప్రత్యర్థులపై సమరశంఖం పూరించాలని అన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ నామ నాగేశ్వరరావు నిర్దేశకత్వంలో ముందుకు సాగి, వైరాలో గులాబీ జెండాను ఎగుర వేద్దామన్నారు. ప్రజల ఆశీస్సులు బీఆర్ఎస్ కే ఉన్నాయని, తప్పకుండా మదన్ లాల్ అఖండ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహాయ సహకారాలతో వైరాలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే శక్తివంచన లేకుండా వైరా అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, ప్రజలను, పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని కార్యకర్తలను కోరారు. తమ అభిమాన నాయకులకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం గ్రామాల వారీగా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు పార్టీ అభ్యర్థి మదన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, జెడ్పిటిసి కళావతి, ఎంపిపి సోని, దిశ కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఏదళపల్లి వీరభద్రం, జిల్లా నాయకులు పోలుదాసు కృష్ణమూర్తి, నున్న రంగారావు, మండల మాజీ అధ్యక్షులు చావా వెంకట రామారావు, దుద్దుకూరి నాగేశ్వరావు, కాజా రమేష్, మంగముడి నాగేశ్వరావు, రోకటి సురేష్, చౌడం నరసింహారావు,వేల్పుల నరసింహారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





