మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 28వ తేదీన సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో పోటీ చేసే యూనియన్లు శనివారం నామినేషన్లు వేశాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ), బిఎంఎస్, ఐ.ఎన్.టి.యు.సి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్), సిఐటియు, హెచ్ ఎం ఎస్, గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం, ఐ.ఎఫ్.టి.యు, టి.ఎన్.టి.యు.సి, తెలంగాణ ఉద్యోగుల సంఘం తోపాటు మరికొన్ని సంఘాలు నామినేషన్లు వేయడం జరిగింది. గుర్తింపు కోసం పోటీ చేసేందుకు మొత్తంగా 13 సంఘాల నామినేషన్లు దాఖలు అయినట్లుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు.





