కొమరం భీమ్ ఆశయాల సాధనే లక్ష్యం
కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, గిరిజనల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని అన్నారు.జల్,జంగిల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసి సమరయోధుడు కొమరం భీం ఆశయాలను పోడు పట్టాల పంపిణీతో సీఎం కేసీఆర్ సహకారం చేశారని వారు తెలియజేశారు.పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాక రైతుబంధు కూడా అమలు చేయడం గొప్ప విషయం అన్నారు.ఆదివాసుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది అన్నారు. హైదరాబాదు నడిబొడ్డున కొమరం భీమ్ ఆత్మగౌరవ భవనాన్ని ప్రభుత్వం నిర్మించడం జరిగిందన్నారు. కొమరం భీమ్ ఆశయ సాధనకై బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరసింహారావు,ఎంపీపీ గుమ్మడి గాంధీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబురావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,ఆదివాసి నాయకులు పోలేబోయిన అనిల్ కుమార్, వట్టం రాంబాబు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.





