కెసిఆర్ సంక్షేమ పాలనకు జై కొట్టండి
* వారంటీ లేని పార్టీలను దూరంగా పెట్టండి
* ఉమ్మడి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
* ఎన్నికల సంగ్రామంలో కలసి కట్టుగా ముందుకు సాగుదాం అన్న నామ
* సమైఖ్యoగా మదన్ లాల్ ను గెలిపించుకుందాం
* వైరాలో గులాబీ జెండా రెపరెపలు ఖాయం
* వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
* సమిష్టిగా సమరశంఖం: రాములు నాయక్
* గెలిపిస్తే మీకు సేవకుడిగా ఉంటా: మదన్ లాల్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
అన్ని వర్గాల ప్రజలకు మంచి పాలన అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని.. ముచ్చటగా మూడోసారి వచ్చేది బిఆర్ఎస్ పాలనేనని పలువురు గులాబీ ప్రజాప్రతినిధులు అన్నారు.
రానున్న ఎన్నికల సంగ్రామంలో అంతా కలసి కట్టుగా ముందుకు సాగి మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించు కుందామని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, వైరా నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి నామ నాగేశ్వరరావు నియోజకవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు. జూలూరుపాడు ఆర్కే కల్యాణ మండపంలో శనివారం పార్టీ మండల అధ్యక్షులు పొన్నకంటి సతీష్ అధ్యక్షతన జరిగిన పార్టీ జూలూరుపాడు మండల ముఖ్య కార్యకర్తలు సమావేశంలో నామ మాట్లాడారు. చిన్న చిన్న పొరపాట్లు సహజం మనీ నేను మీకు అండగా ఉన్నా వాటి సంగతి నేను చూసుకుంటాను నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయని అందరం సమైఖ్యoగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి విజయ దుందుభి మోగిద్దామని నామ అన్నారు. బావ బామ్మర్దులు కలసి కట్టుగా ముందుకు సాగి తిరుగులేని ఆధిక్యంతో మదన్ లాల్ గెలుపు తధ్యమన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్ బీజేపీలను నమ్మొద్దని వారు చెప్పే గ్యారంటీలకు వారంటీ లేదని వారు పాలించే రాష్ట్రాల్లో ఎక్కడా వాటిని అమలు చేయడం చాతకాని వారు ఇక్కడకు వచ్చి మాయ మోసపు మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గతంలో రైతు ఆత్మహత్యలు జరిగాయని సంక్షేమమే లేకుండా ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో వైరా నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థి అద్భుత మెజార్టీతో గెలిపించుకుని వైరాలో గులాబీ జెండా రెపరెపలాడాలని పేర్కొన్నారు. రైతు బిడ్డగా నాకు ఇక్కడ మంచి మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ కు పంపిస్తే రైతుల గురించి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడానని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టానని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణాలో జరిగిందని ఇది కొనసాగాలంటేమూడోసారి కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకోవాలని అన్నారు.
సమిష్టిగా సమరశంఖం పూరిద్దాం: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అందరం సమిష్టిగా ప్రత్యర్థులపై సమరశంఖం పూరిద్దామని అన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ నామ నాగేశ్వరరావు దశ దిశ నిర్దేశకత్వంలో ముందుకు సాగి వైరాలో గులాబీ జెండాను ఎగురవేద్దామన్నారు. ఈ సారి ఓటరు దేవుళ్ళ ఆశీస్సులు బీఆర్ఎస్ కే ఉన్నాయని తప్పకుండా మదన్ లాల్ ను గెలిపించి సత్తా చూపిస్తారని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా మరింత పురోగమించాలంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా రావాలన్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యవేక్షణలో వైరాలో గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు.
అందరి సహకారంతో గెలుస్తా: అభ్యర్థి మదన్
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ ఎంపీ నామ నాగేశ్వరరావు నిర్దేశకత్వం ఓటరు దేవుళ్ళ ఆశీస్సులు సహాయ సహకారాలతో వైరాలో గెలుస్తానని అన్నారు. మా మధ్య పొరపొచ్చాలు ఏమీ లేవని నన్ను గెలిపిస్తే మిమ్మల్ని అందర్నీ కడుపులో పెట్టుకొని పని చేస్తానని అన్నారు. సామాన్యులకు న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ ,జెడ్పిటిసి భూక్య కళావతి, ఎంపిపి లావణ్య సోని,
దిశ కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఏదళ్లపల్లి వీరభద్రం, పార్టీ జిల్లా నాయకులు పోలుదాస్ కృష్ణమూర్తి, చావా వెంకట రామారావు, దుద్దుకూరి నాగేశ్వరావు, కాజా రమేష్, లకావత్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
నామకు బ్రహ్మరధం..
బిఆర్ఎస్ సమావేశం సందర్భంగా జూలూరుపాడులో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్ పాల్గొన్నారు. ప్రజలు భారీగా హాజరై బ్రహ్మరథం పట్టి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. చైతన్య రథంపై ఉండి నామ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆయన వెన్నంటే పార్టీ శ్రేణులు, అభిమానులు ఉండి జై తెలంగాణ.. జై కేసీఆర్ ఉంటూ నినాదాలు చేశారు. దీంతో జూలూరుపాడు మండలం గులాబీ మయంగామారింది.
మండల నేతలతో నామ విస్తృత స్థాయి సమీక్షా..
ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రామాల వారీగా బూత్ స్థాయిలో ఎన్నికల సరళిపై సమీక్షించారు. ఆయా గ్రామాల్లో గతంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ఇప్పుడు ఏ విధమైన కృషి చేయాలి మెజార్టీ ఎలా సాధించాలన్న అంశాలపై దృష్టి పెట్టి సమీక్షించి గ్రామ మండల నాయకులకు దిశా నిర్దేశం చేశారు.





