- మణుగూరులో అభివృద్ధి వెలుగులు
- వెలుగులు విరజిమ్ముతున్న నూతన విద్యుత్ దీపాలు
- 82 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్, రేగా కాంతారావు
- మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని అంబేద్కర్ సెంటర్ నుండి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వరకు సిఐఎస్అర్ నిధులతో సుమారు 82 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనం గా నిర్మించిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా పట్టణాలు పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పట్టణాల సుందరీకరణ కోసం సెంట్రల్ లైటింగ్ డివైడర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు,అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. మణుగూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అందుకు నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,ఎంపీపీ విజయ కుమారి,పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు,ఎంపిటిసిల జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,స్థానిక సర్పంచ్ బచ్చల భారతి,బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు,పంచాయతీరాజ్ శాఖ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.





