ఆర్యవైశ్యుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి
ఆర్యవైశ్య భవనానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధులతో సుమారు 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఆర్యవైశ్య సంఘం భవనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, రాష్ట్రం లోని అన్ని సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించిన సీఎం కేసీఆర్ ఎంతో ఆదర్శప్రాయులు అన్నారు.సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన కుల సంఘాల కు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి తన నియోజకవర్గంలో అమలు చేసేదందుకు విప్లమాత్మకంగా అడుగులు వేస్తున్నానని తెలిపారు.మణుగూరులో అన్ని కులాల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారు అని,కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.చరిత్రలో ఇతర పార్టీలు ఆర్యవైశ్యుల్ని అవసరానికి మాత్రమే వాడుకున్నారు అని,ఇప్పుడు సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చి తగిన గుర్తింపు ప్రాధాన్యత కల్పిస్తున్నారు అన్నారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఈ స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్,పట్టణ ప్రముఖులు దోసపాటి వెంకటేశ్వర్లు,ఆర్యవైశ్య సంఘం నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





