ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్
మన్యం న్యూస్, ఏటూరు నాగారం:ములుగు జిల్లా
ఏటూరు నాగారంను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సర్కారు నిర్ణయంపై రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ విషయం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని నూతన డివిజన్ ల ఏర్పాటుతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంటుందని. నూతన డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ అవుతుందని, ఇకపై స్థానికంగానే పనులు చేసుకునే అవకాశముంటుందని అన్నారు . ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రజల తరపున మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.





