గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
*జానంపేట గ్రామంలో కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్,పినపాక:
మండల పరిధిజానంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన కొమురం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యేరేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని ఆయన అన్నారు, హైదరాబాదు లాంటి మహానగరంలో ఆదివాసి బంజారా భవనాలు నిర్మించి ఇచ్చారన్నారు 10% రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ విద్యలో అవకాశాలు పెంచినట్లు తెలిపారు గిరిజన ప్రాంతాలలో దవాఖాన లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కొమురం భీమ్ ఆశయాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తున్నది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,పోలేబొయిన అనిల్ ,మండల ఆదివాసీ ఐకాస అధ్యక్షులు తొలెం శ్రీను,కాయం శేఖర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాంబ శివ రావు,జానంపేట సర్పంచ్ మహేష్,మడవి రమేష్, డబ్బ గోవర్ధన్,ఆత్మ చైర్మన్ భద్రయ్య,బీ. ఆర్. ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి,దాట్ల వాసుబాబు,కొండేరు రాము,గండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.





