- ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా బతుకమ్మ చీరల పంపిణీ.
- మహిళలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలు.
- ఆడబిడ్డల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్.
- బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన రేగా కాంతారావు.
మన్యం న్యూస్ బూర్గంపహడ్:-
ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి బతుకమ్మ పండగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నది,మహిళా సంక్షేమాని కి సీఎం కేసీఆర్ అనేక రకాల పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల తహసిల్దార్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న దసరా కానుక చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నదని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నదని,తెలంగాణలో ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నదన్నారు.మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందనీ,ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సాంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అని,మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి,షాది ముబారక్,అమ్మ ఒడి,కేసీఆర్ కిట్,ఆరోగ్యలక్ష్మి,న్యూట్రిషన్ కిట్,ఆరోగ్య మహిళ తదితర కార్యక్రమాలు చేపట్టిందనీ అన్నారు,మహిళలు రాష్ట్రంలో అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న,బూర్గంపహడ్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పిఎసిఎస్ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస్ రావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,పార్టీ యూత్ ప్రసిడెంట్ గొనెల నాని,టౌన్ అధ్యక్షులు సొహెల్ పాషా,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లురుపల్లి వంశీ తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది,స్వసైటి డైరెక్టర్ బొల్లు రవి,మండల యూత్ నాయకులు బోల్లు సాంబ,తోకల సతీష్,గంగరాజు యాదవ్,మేకల నర్సింహ రావు,జక్కం సర్వేశ్వరావు,బుపల్లి నర్సింహారావు,మందా ప్రసాద్,కుమ్మరిపల్లి నాగరాజు,సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు సాదిక్ పాషా గ్రామ మహిలలు,ప్రజలు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





