మన్యం న్యూస్ ,బూర్గంపహాడ్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీ.ఆర్.ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నది.అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందనీ చెప్పుకోవచ్చు.ఏజెన్సీ మారుమూల గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది.మారుమూల గ్రామాలలో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కోట్ల అధిరూపాయల నిధులను కేటాయిస్తున్నారన్నారు.పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతునే ఉంది.పినపాక నియోజకవర్గం లోని గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే రేగా కాంతరావు ప్రత్యేక కృషి చేస్తున్నారు,ప్రణాళిక బద్ధంగా సీసీ రోడ్లు,బిటి రహదారులు,బ్రిడ్జిలు,కలవర్టులు,పలు భవనాలు,డ్రైనేజీలు,పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ వంటి అభవృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి వాటిని పూర్తిచేసేలా కృషి చేస్తున్నారు.ఈ క్రమంలో గ్రామపంచయతీ సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు,బూర్గంపహడ్ గ్రామ పంచయతీలో ఎన్నో ఏళ్లుగా బురద రోడ్లతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకు సీసీ రోడ్ల నిర్మాణంతో విముక్తి కలుగుతుంది,తీవ్ర ఇబ్బందులు పడి రోడ్ల పై బురద కారణంగా వర్షాకాలం కనీసం బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడే ప్రజలకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతరావు కృషితో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగి పలు సీసీ రోడ్ల నిర్మాణం జరిగిన విషయం కూడా విధితమే కాగా మరల బూర్గంపహడ్ గ్రామ పంచాయతీలో మిగిలిన సీసీ రోడ్ల నిర్మాణం కొరకు 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించి శనివారం ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిరిపురం స్వప్న,బూర్గంపహడ్ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,పిఎసిఎస్ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస్ రావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,పార్టీ యూత్ ప్రసిడెంట్ గొనెల నాని,టౌన్ అధ్యక్షులు సొహెల్ పాషా,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లురుపల్లి వంశీ తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది,స్వసైటి డైరెక్టర్ బొల్లు రవి,మండల యూత్ నాయకులు తోకల సతీష్,గంగరాజు యాదవ్,మందా ప్రసాద్,కుమ్మరిపల్లి నాగరాజు బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు సాదిక్ పాషా గ్రామ మహిలలు,ప్రజలు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





