ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ ప్రకటనపై సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు
*జెడ్పీ చైర్ పర్సన్,బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
మన్యం న్యూస్ ,ములుగు:
ములుగు జిల్లా ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కిజెడ్పీ చైర్ పర్సన్,బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏటూరు నాగారం మండలం రెవెన్యూ డివిజన్ కావడానికి సహకరించిన
మంత్రులు కే.టీఆర్,హరీష్ రావు ,ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,పార్లమెంట్ సభ్యులు ఎంపీ కవిత,శాసనసభ్యులకు, ములుగు జిల్లా బీ. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, టీ. ఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ,ప్రజా ప్రతినిదులకు కృతజ్ఞతలు తెలిపారు.ఒక నాడు సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ములుగు అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ,ప్రగతిపథంలో నడిపిస్తూ అండదండగా నిలుస్తూ ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆశయాలను నెరవేరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం..ములుగు జిల్లా సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల పక్షాన,ప్రజా ప్రతినిదుల పక్షాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





