హామీ ఇచ్చిన 18 రోజులకే…. *త్రాగు నీటి సమస్య పరిష్కారం *శివలింగాపురం గ్రామ ప్రజల నీటి కష్టాలు తీరుతున్న వేళ
*ఎమ్మెల్యే రేగాకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు
మన్యం న్యూస్,అశ్వాపురం:అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోగత నెలలో ఎమ్మెల్యే రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఆ సందర్భంలో మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదని రేగాకు విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుఆదివారం త్రీ పిహెచ్ బోర్,మోటారు పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరిగింది.స్థానిక ప్రజలు మాట్లాడుతూ హామీ ఇచ్చిన 18 రోజులకే మా సమస్యను పరిష్కరించిన రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించుకొని మా పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకుంటామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీటీసీ గాదె జయ,స్థానిక సర్పంచ్ కాకా అశోక్,ఉప సర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి,వార్డ్ మెంబర్లు,మొండికుంట ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,కార్యదర్శి తౌషిప్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,మండల్ నాయకులు సూది రెడ్డి గోపిరెడ్డి,కొల్లు మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు,గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్ కే యాకూబ్,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,వల్లపు కృష్ణ,కొమ్ము వీరయ్య,జక్కుల కొమురయ్య,బొక్క శ్రీకాంత్ రెడ్డి,మిట్టకంటి సురేందర్ రెడ్డి,కావట్టి ప్రసాదు,కునూసోత్ సూర్య,వీర్య ,చంద్రు ,వాంకుడోత్ వెంకటరమణ,వాంకుడోత్ శ్రీను,గుగులోతు రవి,కిరణ్ సతీష్ ఉదయ్,సాయి,వెంకన్న,మండల నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





