మన్యం న్యూస్ గుండాల: ఈనెల 12, 13 తేదీలలో మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరిగే పి వై ఎల్ జిల్లా మహాసభల పోస్టర్ ను మండల కేంద్రంలో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర నాయకులు ఎనగంటి గణేష్ మాట్లాడుతూ త్యాగాల జిల్లా అయిన మానుకోటలో ఈ సభలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మంగయ్య, ప్రజాపంథా నాయకులు శంకర్, చంద్రన్న, రాజు, జగన్ తదితరులు పాల్గొన్నారు





