మన్యం న్యూస్ చండ్రుగొండ,అక్టోబర్ 08: అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు తిప్పనపల్లి పంచాయతీకి ఇచ్చిన ప్రత్యేక ఫండ్ రూ.20లక్షలతో గ్రామంలో బోరు బావి, పైప్ లైన్ మంజూరు కావడం జరిగిందని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ అన్నారు. ఆదివారం తిప్పనపల్లిలో బోరుకి భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మేల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో మిషన్ భగీరధ నీరు వస్తున్న కొని సందర్భంగా సరఫరాలో ఇబ్బదులు తలెత్తినప్పుడు సమస్యలు ఏర్పడకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా బోరుబావి, పైప్ లైన్ మంజూరి చేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంత్ ధరావత్ పార్వతి, ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, ఉపసర్పంచ్ ధరావత్ రామారావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, వార్డు సభ్యురాలు సయ్యద్ నజ్మా, తదితరులు పాల్గొన్నారు.





