UPDATES  

 బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ.

మన్యం న్యూస్, మంగపేట:
మంగపేట మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏటునాగారం మండల కేంద్రన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసిన సందర్భంగా రాజుపేట గ్రామం నుండి కమలాపురం గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం కమలాపురంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఏటూరునాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ , జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోపి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, యడ్లపెల్లి నర్సింహారావు, చిట్టీమల్ల సమ్మయ్య, కర్రీ శ్యాంబాబు, చిలకమర్రి రాజేందర్, గాదె శ్రీనివాస్ చారి , కుంట ఏడుకొండలు, మాలికంట శంకర్,రాజమల్ల సుకుమార్,చల్లగురుగుల తిరుపతి ,పోదేం కృష్ణప్రసాద్, కొమరం రాంమూర్తి, లలితమ్మ,పి ఏ సి ఎస్ డైరెక్టర్లు,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మండల గ్రామ అనుబంధ సంఘాలు, యువజన విభాగ నాయకులు, మహిళలు,బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !