మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 08, మండల పరిధిలోని బొజ్జ తండా, అన్నారుపాడు గ్రామ పంచాయతీలలో ఇటీవల నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయాలను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం అన్నారపాడు గ్రామపంచాయతీలో సుమారు 24 లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ కి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, సర్పంచులు బానోత్ పద్మ, కిషన్ లాల్, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, ఎల్లంకి సత్యనారాయణ, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, కొదుమూరి కోటేశ్వరరావు, మిరియాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.