మన్యం న్యూస్ ,చర్ల:
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలోని గిరిజన గ్రామాలైన వొద్ధిపేట, పూసగుప్ప లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఆదివారంవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వయోవృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే వైద్యం అందించే ఉద్దేశంతో మండలంలోని ఎనిమిది వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ సర్వే (బి పి), మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, సి బి పి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఈ వైద్య శిబిరాలను కలెక్టర్ ప్రియాంక అల, జిల్లా వైద్య అధికారి జేవియల్ శిరీష సహాయ సహకారాలు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఆర్ చంద్ర ప్రసాద్, డాక్టర్స్ శ్రీధర్, సందీప్, వై. సూర్యనారాయణ, రాజారెడ్డి, కామేశ్వరరావు, మారుతి కాలేజ్ విద్యార్థులు, హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.





