మన్యం న్యూస్ ,
నూగురు వెంకటాపురం:
మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ గుర్రం వెంకటేశ్వర్లు 13 వ వర్ధంతి సభ ఆర్ అండ్ &బీ గెస్ట్ హౌస్ ఆవరణలో వంకా రాములు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రం వెంకటేశ్వర్లు ఎక్కడో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండు సార్లు మండల కార్యదర్శి గా భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులుగా పనిచేసి ఈ ప్రాంతంలో గిరిజనులకు, పేదప్రజల కోసం ఉద్యమాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండి నడిపించారని అన్నారు. మండలంలో సిపిఎం పార్టీ ఎదుగుదలకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు గుర్రం వెంకటేశ్వర్లు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు గ్యానం.వాసు, గుర్రం వెంకటేశ్వర్లు గారి సోదరులు ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం పుల్లారావు, ఆదినారాయణ,పోశాలు, సత్యం, చిరంజీవి,ఇర్ప.శ్రీను,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.





